మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో

మాజీ మంత్రి, మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను కలిశా. అందులో ఎలాంటి రాజకీయం లేదు. నేను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతా. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని స్పష్టం చేశారు.
అధిష్ఠానం అవకాశమిస్తే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని ఇటీవల మల్లారెడ్డి తెలిపారు. కానీ, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తన కుటుంబం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా రాజకీయాలు విరమించుకుంటానని చెప్పడం గమనార్హం.