సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి మరోసారి ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచీ పార్టీ కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నారు. ప్రజాచైతన్యయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించడం ద్వారా ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. సాధారణ ఎన్నిలకు మరో ఏడాదే ఉన్న నేపథ్యంలో చాడ అయితేనే పార్టీని సమర్థంగా నడపగలుగుతారని నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీని నేడు ఎన్నుకోనున్న నేపథ్యంలో స్వల్ప మార్పులతో పాత కమిటీయే ఉండే అవకావం ఉందని పార్టీ నేత ఒకరు తెలిపారు.













