అచ్చేదిన్ కాదు.. చచ్చే దిన్ వచ్చింది : చాడా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అచ్చేదిన్ అన్నాడు కానీ, చచ్చే దిన్ వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాడ మీడియా తో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేటర్ దిగ్గజాలకు పెద్ద పీట వేస్తోందని ఆరోపించారు. ధరలు పెంచి ప్రజలను నిలువు దోపిడీ చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం మోదీ అమ్మేస్తున్నారు అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. పోడు సాగుదారులపై అటవీశాఖ అధికారులు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. పొడు సాగుదారుల పొట్టకొట్టకుండా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రతిపక్షాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు.













