కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతోందనే.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో కాంగ్రెస్కు ఆదరణ పెరుగుతోందనే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అనేక ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లోనే అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లు కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనకు అద్దం పడుతున్నాయి. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీద జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపించాలి. కాంగ్రెస్ పై నెపం నెట్టడం సరైంది కాదు. కేసీఆర్ వైఫల్యాలే కాంగ్రెస్ అనుకూల పవనాలకు కారణం. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సీపీఐ పని చేస్తుంది అని అన్నారు.













