ఢిల్లీకి పోతే అనుకూలం.. తెలంగాణకు వస్తే ప్రతికూలం
బీజేపీ అడుగుజాడల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీకి పోతే అనుకూలంగా, తెలంగాణకు వస్తే ప్రతికూలంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 119 నియోజక వర్గాల్లో 25 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. హుస్నాబాద్ నియోజవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. దేశంలో బీజేపీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై ఆర్థికంగా, చట్టపరంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను తక్కువ ధరలకే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయని అన్నారు.













