కేంద్ర ప్రభుత్వం ఆధ్వరంలో తొలిసారిగా…. తెలంగాణ ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించనుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జూన్ 2న ఢిల్లీలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరగనున్న రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మీనాక్షి లేఖి కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనున్నారు. ఈ వేడకల్లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ, గాయకుడు హేమచంద్ర ప్రదర్శనలు ఇస్తారు. తెలంగాణకు చెందిన జానపద నృత్యకారులు, ఢిల్లీ కథక్ కేంద్రానికి చెందిన కళాకారులు ప్రదర్శనలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.













