మూడోసారి ప్రధాని పీఠంపై ఆయనే : కిషన్ రెడ్డి
నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సనత్నగర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సంద్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి రహిత పరిపాలన సాగిస్తూ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన గొప్ప నాయకుడిగా మోదీ నిలిచారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూ జాతి గౌరవాన్ని పెంపొందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి లోపించింది. జాతీయ రహదారుల విస్తరణ, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, విమానాశ్రయాల పెంపు, పేదలందరికీ నాణ్యమైన బియ్యం, కరోనా వ్యాక్సిన్ పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు మోదీ హయాంలో అమలయ్యాయి. దాంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు అని అన్నారు.













