తెలంగాణకు కేంద్రం షాక్….
తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా మొదటి వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. 4 లక్షల రెమిడిసివర్ ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చామని 21,500 ఇంజక్షన్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. రెమిడిసివర్ విషయంలో కేంద్రం షాక్ ఇచ్చినట్లైందని అన్నారు. రాష్ట్రానికి సరిపడా డోసులు లేవన్నారు. ఇతర రాష్ట్రాల పేషెంట్లకు కూడా వైద్యం చేస్తున్నామన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా కేటాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమిడిసివర్ ఇంజక్షన్లకు కేంద్రం పరధిలోకి తీసుకుందని, కేంద్రం తీరు చాలా బాధాకరమన్నారు. రాజకీయాలు పక్కనబెట్టి కేటాయింపులు చేయాలని కోరారు. ఆక్సిజన్ ట్యాంకర్ల కొరత ఇబ్బందిగా మారిందని అన్నారు. రెమిడిసివర్ బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.













