మెదక్ చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన సీఎస్ఐ మెదక్ కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావటంతో చర్చి ప్రాంగణం భక్త జనసంద్రంగా మారింది. తెల్లవారుజామున 4:30 గంటలకు తొలి ఆరాధనతో వేడుకలు ఆరంభమయ్యాయి. 10 గంటలకు రెండో ఆరాధన నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం శిలువను ఊరేగించి చర్చి లోపల ప్రతిష్ఠించారు. అనంతరం సీఎస్ మెదక్ డయాసిస్ బిషప్ రైట్ రెవరెండ్ పద్మారావు దైవ సందేశాన్ని వినిపించి, ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. రాత్రి వరకు భక్తులు చర్చిలో ప్రార్థనల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు.













