ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోకరు అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో మరొకరు అరెస్టయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్(సీఏ) గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, హైదరాబాద్కు చెందిన పలు సంస్థలకు లబ్ది చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ బుచ్చిబాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపిన అధికారులు బుధవారం అరెస్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం బుచ్చిబాబును రౌస్ ఎవెన్యూకోర్టులో హాజరుపరచనున్నారు.













