ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, రేవంత్‍రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‍ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్ తన పిటిషన్‍లో పేర్కొన్నారు. గతంలో ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు రేవంత్. అయితే ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది. 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్‍సన్‍ను ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరపున రేవంత్‍రెడ్డి ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్‍ను ఎన్‍ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది.