బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ పై భద్రాచలం ఈవో కేస్..

ఎన్నికలకు ప్రచారం ఎంత ముఖ్యమో గెలవాలి అంటే లక్ తో పాటు దేవుడి ఆశీర్వాదం ఉండడం కూడా అంతే ముఖ్యం. అందుకే అభ్యర్థులు కులమత బేధాలను పక్కనపెట్టి దేవాలయం దగ్గర నుంచి మసీదు వరకు గెలవాలి అని ప్రతి దగ్గర ప్రత్యేకంగా ప్రార్థనలను నిర్వహిస్తారు. అయితే అనుకోకుండా ఒకరి విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది.మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ నిన్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించడం కోసం వెళ్లారు. ఈ సందర్భంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన అనుచరులు స్వామివారి మూలవిరాట్ ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. గుడి నియమ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ సీతారాం నాయక్ పై ఈవో రమాదేవి భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.