ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ కన్నుమూత
ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 7వ తేదీన అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. పొలిటికల్ కార్టూన్లలో మోహన్ ప్రత్యేక శైలిని పరిచయం చేశారు. మోహన్ ఉదయం, ఆంధ్రప్రభ వంటి పలు పత్రికల్లో పనిచేశారు. పొలిటికల్ కార్టూన్లకు ఆయన పెట్టింది పేరు. ఆయన వ్యక్తి కాదు, ఓ స్కూల్. పలువురు పిల్ల కార్టూనిస్టులకు ఆశ్రయం ఇచ్చి, వారికి ఉపాధి మార్గం చూపించిన ఘనత కూడా ఆయనది.
కార్టూనిస్ట్ మోహన్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్.













