చుక్కేస్తే బండి బంద్!
చాలావరకు రోడ్డు ప్రమాదాలకు కారణం మద్యం తాగి వాహనాలు నడపడమే. ఇదే విషయాన్ని గమనించిన ఓ ఇంటర్ విద్యార్థి మందేస్తే బండి బంద్ అయ్యేలా వినూత్న ఆవిష్కరణ చేశాడు. అతనే జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన అంగరి నవీన్. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ఆవిష్కరణను ప్రదర్శించాడు. యంక్యు-3 సెన్సర్, యాంటీనా, డీవీడీ ఇన్పుట్ పరికరాలను హెల్మెట్, ద్విచక్రవాహనానికి అమర్చడం ద్వారా దీన్ని రూపొందించినట్లు చెప్పాడు. మద్యం తాగి హెల్మెట్ పెట్టుకోగానే.. సెన్సర్లు గుర్తించి బండి ఆగిపోయేలా చేస్తుందని తెలిపారు.













