హైదరాబాద్ మేయర్ కు అమెరికా.. ఆక్సిజన్ కాన్సంట్రేషన్ ల బహుకరణ
అమెరికా కాలిఫోర్నియాలోని రివర్సైడ్ నగరం హైదరాబాద్ నగరానికి అభయ హస్తం అందించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు ఆక్సిజన్ కాన్సంట్రేషన్ లను అందించింది. వీటిని రివర్సైడ్ సిటీ మేయర్ పాట్రీషియా డాసన్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అందజేశారు. 2000 సంవత్సరంలో రివర్సైడ్ సిటీ హైదరాబాద్‌ల మధ్య సిస్టర్ సిటీ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా విపత్కర పరిస్థితుల సమయంలో ఇరు నగరాలు ఒక్కరిఒక్కరూ సహాయం అందించుకుంటున్నాయి. దీంతో కరోనా నేపథ్యంలో తనవంతు సహాయంగా రివర్సైడ్ సిటీ మేయర్ హైదరాబాద్‌కు ఆక్సిజన్ కాన్సంట్రేషన్‌ను అందజేయడం పట్ల రివర్సైడ్ మేయర్‌కు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కృతజ్థతలు తెలిపారు. వీటిని నగరంలోని ఏదైన ప్రధాన ఆసుపత్రికి అందజేయనున్నట్లు ఆమె వెల్లడించారు.













