TGPSC: టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం బాధ్యతల స్వీకరణ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై పూర్తి స్థాయిలో అభ్యర్థులో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం (Burra Venkatesham) తెలిపారు. నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో ఆయన చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ ఐఏఎస్ తన కల అన్నారు. కష్టపడి పబ్లిక్ సర్వెంట్గా మారిన తాను, నిరుద్యోగ అభ్యర్థుల కోసం మూడున్నరేళ్ల సర్వీస్ని వదులకుని టీజీపీఎస్సీ బాధ్యతలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు భర్తీ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా చేపడతామని హామీ ఇచ్చారు. అభ్యర్థులు కమిషన్పై నమ్మకంతో పరీక్షలకు హాజరు కావాలని కోరారు.