తెలంగాణకు మాయవతి
యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి మే 7న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని సరూర్నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సభకు మాయవతి ముఖ్య అతిధిగా హాజరవుతారు. తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అద్యక్షుడు డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న సభ కావడంతో భారీ జన సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్లింల మైనార్టీలను రద్దు చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. రిజర్వేషన్లు మతం పేరిట ఇచ్చినవి కావనీ, ఈ విషయం కూడా కేంద్ర మంత్రికి తెలవకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అమిత్ షా చేసిన రిజర్వేషన్ల తొలగింపు ప్రకటనను ఖండిస్తున్నామని తెలిపారు. అవసరమైతే వారికి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.













