బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
బహుజన సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. కాన్షీ యువ సర్కార్ పేరిట యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఆ 10 లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తాం. ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తాం. ప్రతి కుటుంబానికి రూ.15లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ.25 వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్. భీం రక్షా కేంద్రాలు కింద వృద్థులకు వసతి, ఆహారం, వైద్యం అందిస్తామన్నారు.













