బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే… ప్రవీణ్ కుమార్ పోటీ ఎక్కడి నుంచంటే ?
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బహుజన్ సమాజ్ పార్టీ సిద్దమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తో పాటు మొత్తం 20 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సిర్పూర్ స్థానం నుంచి బరిలో దిగనున్నారు.
అభ్యర్థుల తొలి జాబితా ఇదే :
సిర్పూర్-డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, జహీరాబాద్-జంగం గోపి, పెద్దపల్లి-దాసరి ఉషా, తాండూర్-చంద్రశేఖర్ ముదిరాజ్, దేవరకొండ-డా.ముదావత్ వెంకటేశ్ చౌహాన్, చొప్పదండి-కొంకటి శేఖర్, పాలేరు-అల్లిక వెంకటేశ్వరరావు యాదవ్, నకిరేకల్-మేడి ప్రియదర్శిని, వైరా-బానోత్ రాంబాబు నాయక్, ధర్మపురి-నక్కా విజయ్ కుమార్, వనపర్తి-నాగమోని చెన్న రాములు ముదిరాజ్, మానకొండూర్-ఎన్. రాంచందర్, కోదాడ-పిలుట్ల శ్రీనివాస్, నాగర్‌కర్నూలు-కొత్తపల్లి కుమార్, ఖానాపూర్-బన్సిలాల్ రాథోడ్, అందోల్-ముప్పారపు ప్రకాశం, సూర్యాపేట-వట్టే జానయ్య యాదవ్, వికారాబాద్-గడ్డం క్రాంతి కుమార్, కొత్తగూడెం-ఎర్రా కామేశ్, జుక్కల్-ప్రద్న్య కుమార్ మహదేవ్‌రావు ఏకాంబర్.













