అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు
అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు, అధికారులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కొమురం భీం జిల్లా కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో రూ.కోట్ల అవినీతి జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్యేల అక్రమాలకు జిల్లా కలెక్టర్ సహకరిస్తున్నారని, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనప్ప అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. అన్నింటికి బాధ్యుడైన కలెక్టర్‌పై చర్యలు తీసుకొనే దాకా పోరాడాలని అన్నారు.













