ప్రభుత్వ పాఠశాలకు 8 గుంటల భూమిని విరాళం ఇచ్చిన ఎన్నారై
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల హమాలీవాడకు చెందిన ప్రవాస బీఆర్ఎస్ నాయకుడు ఇసంపల్లి రమేష్ ఎనిమిది గుంటల భూమిని పాఠఠాల అభివృద్ధికి విరాళంగా ప్రకటించారు. దానికి సంబంధించిన పత్రాలను ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను స్ఫూర్తిగా తీసుకొని ఈ విరాళం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రమేశ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. బృహత్తర లక్ష్యంతో సాగుతున్న ఈ కార్యక్రమంతో పాటు పాఠశాలలు రూపురేఖలు మారాయని తెలిపారు. మన ఊరు`మన బడిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరు. కార్యక్రమంలో రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసి) చైర్మన్ అనిల్ పాల్గొన్నారు.













