బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై !

బీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు ఆయన తెలిపారు. నేడో, రేపు అనుచరులతో కలిసి చేరతానని తెలిపారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.