ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తడో.. హైదరాబాద్ లో ఆ ప్రభుత్వం
రైతుబంధు కావాల్నా? రాబంధు కావాల్నా ఏదో కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యవహారశైలిపై ధ్వజమెత్తారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నడు. కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులన్నీ దుబారా చేస్తున్నడని మాట్లాడుతున్నడు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతున్నడు. కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులన్నీ దుబారా చేస్తున్నడని మాట్లాడుతున్నడు. రైతుబంధు వేస్టా? రైతుబంధు ఉండాలంటే ఆదిలాబాద్‌లో జోగు రామన్న గెలవాలి. ఎకరానికి రూ.10 వేలు వచ్చే రైతుబంధు రూ.16 వేలు అవుతుంది అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంటు కూడా వేస్ట్ అంటున్నడు. మూడు గంటలు ఇస్తే సరిపోతుంది అంటున్నడు. మరి మూడు గంటల కరెంటు సరిపోతుందా? 24 గంటలు కరెంటు కావాలంటే జోగురామన్ననే గెలవాలి. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తడో హైదరాబాద్‌లో ఆ ప్రభుత్వం వస్తుంది. మరి ఓటు ఇంకొకలకు వేసి పని ఇంకొగొలను చేయమంటే చేయరు. ఓటు వేరేవారికి వేసి జోగురామన్నను పని చేయంటే ఎట్ల చేస్తడు? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే నడుస్తదా. మనపరంగా ఎవరైతే ఉండి యుద్ధం చేస్తరో వాళ్ల చేతిలోనే కతిపెడతే కథ నడుస్తుంది అన్నారు.













