ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్‌ఎస్, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్‌ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, తన జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.