ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష
మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో రెండుసార్లు హామీ ఇచ్చి మాట తప్పుతోందని ఆమె ఆరోపించారు. ఇందుకు నిరసనగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10వ తేదీని ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న దీక్ష చేపడదామనుకుంటే హోలీ పండగ ఉన్నందున 10వ తేదీన దీక్ష చేపడుతున్నాం అన్నారు. ఈ దీక్షకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నాం. మార్చి 13 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సెషన్లోనే మహిళా రిజర్వేన్ బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 20014లో అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలకు రిజర్వేన్ కల్పిస్తామని బీజేపీ నేతలు తెలిపారు. 2019లో కూడా అదే మాట చెప్పి విస్మరించారు. బీజేపీ అధికారంలో వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా జనాభా గణనను చేపట్టకపోవడం చాలా దురదృష్టకరం అని అన్నారు.













