స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం .. దానంపై

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసింది. స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిసిన నేతలు ఈ మేరకు పిటిషన్ సమర్పించారు. ఈ అంశంలో చర్యలు తీసుకుంటామని సభాపతి తమకు హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిర్ణయం మూడు నెలల్లో తీసుకోవాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని పేర్కొన్నారు.