మాపై రేవంత్ ఫిర్యాదు చేయడం ఏంటి: సుధీర్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించారు. తమపై రేవంత్ రెడ్డి ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన రేవంత్ మాపై ఫిర్యాదులు చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోకి ఏ ఇతర పార్టీల నేతలు వచ్చి చేరలేదా?, అప్పుడు ఆయా పార్టీలు కూడా ఇలానే ఫిర్యాదులు చేశాయా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ బీ టీంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉండి పార్టీని మరింత బలహీనపరుస్తున్నారని సుధీర్ రెడ్డి విమర్శించారు.













