బీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చేరారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తన అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ నేత గాలి అనిల్‌కుమార్ సైతం అధికార పార్టీలో చేరారు. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన సతీమణి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, నేతలు నీలం మధు, శశికళాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.