తెలంగాణలో పలు కార్పొరేషన్ల చైర్మన్ లు రాజీనామా
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖలు పంపారు. రాజీనామా చేసిన వారిలో సోమ భరత్ కుమార్ ( చైర్మన్, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్), జూలూరీ గౌరీ శంకర్ (చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ), పల్లె రవి కుమార్ గౌడ్ ( చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్), డాక్టర్ ఆంజనేయ గౌడ్ ( చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ), మేడె రాజీవ్ సాగర్ ( చైర్మన్, ఫుడ్ కార్పొరేషన్), దూదిమెట్ల బాలరాజు యాదవ్ ( చైర్మన్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ), గూడూరు ప్రవీణ్ ( చైర్మన్ టెక్స్టైల్ కార్పొరేషన్), గజ్జెల నగేష్ (చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్), అనిల్ కూర్మాచలం (చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్), రామచంద్ర నాయక్ ( చైర్మన్, ట్రైకార్), డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ( చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ), రవీందర్ సింగ్ ( చైర్మన్, పౌర సరఫరాల సంస్థ), జగన్మోహన్ రావు (చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్), వలియా నాయక్ తదితరులు ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.













