ఆమెను పిలిస్తే నిరసన తెలుపుతాం : కవిత
హామీల అమలుకు ప్రియాంకా గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు ఏ పదవీ లేని ప్రియాంకను ఎలా పిలుస్తారు? ఆమెను పిలస్తే నిరసన తెలుపుతాం అని అన్నారు. ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను ప్రభుత్వ ఖర్చుతో హైదరాబాద్ తరలించారు. రోజూ ప్రజలను కలుస్తానని సీఎం అన్నారు. ఒక్క రోజే ప్రజలను కలిశారు. ప్రజాదర్బార్ అన్నారు. అక్కడికి వెళ్లడం లేదు. ఆయనను యూటర్న్ సీఎం అని ప్రజలు అనుకుంటున్నారు అని విమర్శించారు.













