త్వరలోనే కవితకు బెయిల్ : కేటీఆర్

డిల్లీ మద్యం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని, అరవింద్ కేజ్రీవాల్, కవితకు కూడా వస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఛార్జ్‌షీట్ వేశాక జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కవితకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. జైల్లో కవిత 11 కిలోల బరువు తగ్గారని, బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.