Errolla srinivas : బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు

బీఆర్‌ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్(Errolla srinivas) కు నాంపల్లి కోర్టు (Nampally Court )బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విధులను అడ్డుకున్నారని శ్రీనివాస్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే నాంపల్లి పోలీసులు ఆయన్ను 3 సార్లు విచారణకు పిలిచారు. విచారణకు రాకపోవడంతో గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital ) లో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. వాదనలు విన్న కోర్టు శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని, పోలీసులు(Police) విచారణకు సహకరించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.