ఇదేనా కాంగ్రెస్ మార్పు పాలన? : శ్రీనివాస్‌గౌడ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పేదలు, దివ్యాంగుల ఇళ్లు కూల్చడమేంటని అధికారులను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోటీసులు లేకుండా ఎలా కూలుస్తారని నిలదీశారు. డబ్బు ఉన్న వాళ్లకు ఎన్ని నోటీసులైనా ఇస్తారు కదా? దివ్యాంగులకు సంబంధించిన ఇళ్లను ఎందుకు కూల్చారు? వాళ్లపై మీ ప్రతాపమా? పేదలు, ధనికులకు న్యాయం ఒక విధంగా ఉండదా? ఇదేనా కాంగ్రెస్ మార్పు పాలన? బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలి. లేదంటే కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాను. దీనిపై మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.