ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజలకు కష్టాలు : కాసర్ల నాగేందర్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు తప్పవని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. పదేళ్లలో చేసుకున్న అభివృద్ధి మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని వెల్లడిరచారు. బీఆర్ఎస్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తమ బృందం నల్గొండలో గడప గడపకు కేసీఆర్ చేసిన అభివృద్ధిని తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. మూడోసారి సీఎం కేసీఆర్ను గెలిపించుకొని అభివృద్ధిలో ఇంకా దూసుకెళ్దామన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం అదోగతి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భరత్ సింహారెడ్డి, కార్తిక్ గౌడ్, కత్తుల వినోద్, సునీల్, శ్రేవేకర్, వీరేందర్, దినేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.













