హైదరాబాద్ అందాలన్నీ చార్మినార్ లోనే : బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
హైదరాబాద్ అందాలు చార్మినార్లోనే దాగున్నాయని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పాతబస్తీలోని చారిత్రక కట్టడాలైన మక్కామసీద్, చార్మినార్, మదీనా సమీపంలోని బదేషాహి అఘార్ఖానాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన చారిత్రక కట్టడాలన్ని పాత నగరంలోనే ఉన్నాయి. అయినప్పటికీ, అభివృద్ధిలో కొత్తనగరంతో పాటుగా పాతనగరం పోటీపడుతోందని అభిప్రాయపడ్డారు. ఆండ్రూ ఫ్లెమింగ్ పర్యటన నేపథ్యంలో చార్మినార్, హుస్సేనిఆలం ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.













