మంత్రి జగదీశ్ రెడ్డితో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
బ్రిటన్ నూతన డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓపెన్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, వినియోగం, సరఫరా, విద్యుత్‌రంగ అభివృద్ధి తదితర అంశాలపై ఆయనకు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైన రాష్ట్రం భారత్‌లో తెలంగాణ ఒక్కటేనని తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్‌ను మంత్రి సన్మానించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ పాల్గొన్నారు.













