సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏప్రిల్ 10న భద్రాచలంలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఏప్రిల్ 11న శ్రీరామచంద్ర స్వామి మహాపట్టాభిషేక మహోత్సవాన్ని జరపనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తుల మధ్య నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కల్యాణోత్సవం టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తామని ఈవో వెల్లడించారు. కొవిడ్ వల్ల రెండేళ్లుగా భక్తులు లేకుండానే కల్యాణాన్ని నిర్వహించారు.













