ఘనంగా మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి నిశ్చితార్థ వేడుక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఘనంగా జరిగింది. కదిరి బాలకృష్ణ కుమార్తె పూజితను సందీప్ వివాహమాడనున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, టాలీవుడ్ సినీ తారలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలు విడుదల రజినీ, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, మా అధ్యక్షుడు మంచు విష్ణు, బెల్లకొండ శ్రీనివాస్, బండ్ల గణేశ్, ఎంపీలు కె.కేశవరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ తదితరులు హాజరయ్యారు.













