హైదరాబాద్ లో మరో జాతీయ సదస్సు
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ప్రపంచంలో అతిపెద్ద రిఫరల్ ఆర్గనైజేషన్ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) సదస్సు సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనున్నది. ఇందుకు సంబంధించిన లోగోను తెలంగాణ రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. చిన్న స్థాయి పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ఇలాంటి సదస్సులు ఎంతో తోడ్పాటునందించనున్నాయని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 3 వేల మంది డెలిగేట్స్ హాజరయ్యే అవకాశం ఉన్నదని నిర్వాహకులు తెలిపారు. బీఎన్ఐలో 78 దేశాలకు చెందిన 3.1 లక్షల మంది సభ్యులు ఉన్నారు.













