తెలంగాణ వచ్చిన… వారికి న్యాయం జరగలేదు
బంగారు తెలంగాణ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, ఆయన కుటుంబ మాత్రమే బంగారంలా మారింది బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆరోపించారు. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ఎవరి జాగీరు కాదన్నారు. యువత బలిదానాల కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అయినా వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు కోసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని కోరారు.
అంతకు ముందు తేజస్వి సూర్య గన్‌పార్క్ ను సందర్శించారు. హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ లోని అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.













