Ramachandra Rao: వారి ఓట్లు తొలగిస్తే మీకెందుకు ఇబ్బంది: రామచంద్ర రావు
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై ఎందుకంత ప్రేమ? చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తే మీకెందుకు ఇబ్బంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramachandra Rao) కాంగ్రెస్ ను నిలదీశారు. సర్దార్ పటేల్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నాయకులు నివాళులర్పించారు. అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. భారతీయులు కానివారికి ఓటు హక్కు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని అన్నారు. ఓటరు జాబితాలో పేరు తొలగిస్తే ఆధార్ కార్డు (Aadhaar card) కూడా రద్దు చేస్తారంటూ సీఎం రేవంత్ (CM Revanth) చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఢిల్లీలో ర్యాలీ సందర్భంగా ప్రధాని మోదీ (Modi)ని కాంగ్రెస్ నాయకులు బెదిరించే రీతిలో నినాదాలు చేశారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా కబర్ అనే పదంతో కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా నినాదాలు చేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు బీజేపీ బలపరిచిన 600 మంది సర్పంచులుగా, 45వేల మంది వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు.






