హుజురాబాద్లో ఈటల గెలుపు ఖాయం : రాములమ్మ
హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ తప్పకుండా గెలుస్తారని బీజేపీ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ బై ఎలక్షన్లో ఓడిపోతామనే భయం ముఖ్యమంత్రి కేసీఆర్కు పట్టుకుందని అన్నారు. అందుకే ఆ బంద్ ఈ బంద్ అని అంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యమ్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది బీజేపీ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన సంగ్రామ యాత్ర విజయవంతమవుతుందని అన్నారు.













