టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిన నలుగురు వ్యక్తులు ఢిల్లీకి చెందిన వారని తెలుస్తోంది. మొత్తం నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఎర వేసేందుకు ప్రయత్నించిన వీళ్లు చివరకు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయారు. అచ్చంపేటకు చెందిన ఎమ్మెల్యే బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని సంప్రదించిన వీళ్లు భారీగా డబ్బు ఆశచూపినట్లు సమాచారం. దీనికోసం భారీగా డబ్బు తీసుకొని ఫాంహౌస్ చేరుకున్న నిందితుల ఉప్పందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు చేరుకొని నలుగుర్నీ అరెస్టు చేశారు.













