వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో… కుటుంబపాలన అంతం
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన రజాకార్లను తలపిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబపాలన అంతం కావడం ఖాయమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ వికాసం కోసం కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించిందని అన్నారు. ఇటీవల గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డును మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ గతంలో ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించింది. అందుకే ప్రతి రాష్ట్రంలో క్రమంగా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవిస్తూ వచ్చాయి. తెలంణ రాష్ట్ర సమితి ( ఇప్పటి బీఆర్ఎస్) ఆ విధంగా ఆవిర్భవించిందే. అందుకే చాలా కాలం పాటు జాతీయ ఆకాంక్షలు విస్మరణకు గురయ్యాయి. కేవలం తమ ఆకాంక్షల కోసమే ప్రాంతీయ పార్టీలు అవిర్భవించాయి. క్రమక్రమంగా ఈ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ. కేసీఆర్కు ఒక సందేశం ఇస్తున్నా, వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయి అని అన్నారు.













