కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన మరునాడే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీలో కీలక పదవి వరించింది. రాజగోపాల్‌రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. గత కొంతకాలంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారన్న వార్తల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.













