తెలంగాణలో 10 ఎంపీ సీట్లు కచ్చితంగా గెలుస్తాం : లక్ష్మణ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది గాలివాటం గెలుపని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని చెప్పారు. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపు బీజేపీదేనని అన్నారు. 17 సీట్లలోనూ గట్టి పోటీ ఇస్తామని, 10కి తక్కువ కాకుండా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రహస్య ఒప్పందం మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరించుకుంటున్నాయని తెలిపారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్తో విసిగిపోయి తమకు భవిష్యత్ ఉండదనే ఉద్దేశంతోనే కూటమి, పార్టీలు, నేతలు బయటకు వస్తున్నారన్నారు.













