ఈ విషయంలో రేవంత్ రెడ్డికి అవగాహన లేదు : అరవింద్
పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలో తమకు తెలుసునని, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ అర్వింద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పసుపు బోర్డు నిర్వహించే కార్యకలాపాలపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. మంత్రిగా పని చేసిన అనుభవం రేవంత్ రెడ్డికి లేదని, ఇకపై జీవితంలో ఎప్పుడూ మంత్రి కాలేరని అన్నారు. పసుపు పంటను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. చెరుకు ప్యాక్టరీలను కనుమరుగయ్యేలా చేసింది టీడీపీ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ వీడేది తెలియదు. కొడంగల్లో తరమితే వచ్చి మల్కాజిగిరిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందింది అని అన్నారు.













