వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే నాపై పోటీ చేయి…కవితకు అర్వింద్ కౌంటర్
70 సంవత్సరాల తన తల్లిని భయపెట్టిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మీ అయ్య మాట్లడినట్టు నేను మాట్లాడాను అంటూ ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు. తామేమైనా కేసీఆర్ మీద డాడి చేశామా? అని ప్రశ్నించారు. ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత ఫోన్ కాల్ చేయడం నిజమా కాదా? అనేది ఎంక్వయిరీ చేయాలన్నారు. అందరి కాల్స్ ట్యాప్ చేస్తారు కాబట్టి కవిత కాల్స్ కూడా ట్యాప్ చేయాలని డిమాండ్ చేశారు.
తన తల్లి ఇంట్లో ఉండగా భయపెట్టించేలా దేవుడి పటాలు, కారు అద్దాలు పగలగొట్టారన్నారు. ప్రగతి భవన్ మీద ఎప్పుడైనా దాడి చేశానా? అని ప్రశ్నించారు. నా తల్లి గారిని భయపెట్టించే హక్కు ఎవరిచ్చారు? విపరీతమైన కుల అహంకారంతో మాట్లాడుతున్నారు. కేసీఆర్, కవిత, కేటీఆర్‌లకు విపరీతమైన కులాహంకారం. వచ్చే ఎన్నికల్లో మళ్లీ నిలబడతా, దమ్ముంటే నాపై పోటీ చేయి. మీ అయ్య మాట్లాడినట్లు నేను మాట్లాడాను. నా మీద పోటీ చేయడానికి ఆహ్వానిస్తూ. దాడులు చేస్తే భయపడేది లేదు అని పేర్కొన్నారు.













