రాజాసింగ్ కు 14 రోజులు రిమాండ్… చంచల్ గూడ జైలుకు
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. మంగళ్‌హాట్‌లో ఖాదీర్ అనే వ్యక్తి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజాసింగ్‌ను అరెస్టు చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు వద్ద రాజాసింగ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు సమీపంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ క్రమంలో నిరసనకారులు కోర్టు ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో నాంపల్లిలో ఉద్రికత్త నెలకొంది.













