ప్రాణం పోయినా.. ఆ పార్టీల్లోకి వెళ్లను
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో స్వతంత్రంగా లేదా, ఇతర పార్టీల నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్యూలర్ పార్టీల్లోకి వెళ్లను. ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్లో చేరను. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ మజ్లిస్ చేతిలో ఉంది. మజ్లిస్ నిర్ణయం కోసమే గోషామహల్ స్థానాన్ని కేసీఆర్ పెండిరగ్లో పెట్టారు. బీజేపీ అధిష్ఠానం నాపై సానుకూలంగా ఉంది. సరైన సమయంలో నాపై సస్పెన్షన్ను ఎత్తివేస్తారు అని తెలిపారు.













